ఏదైనా సోషల్ మీడియా చేయగలదు, ఎవరికి అయినా సాయం చేయగలదు, తప్పుని కూడా పది మందికి తెలిసేలా చేస్తుంది సోషల్ మీడియా, నిజమే ఎక్కడో ఉన్న వారిని కూడా తెరపైకి తీసుకువస్తుంది, వారికి బాట చూపిస్తుంది, అలాంటిదే ఈ ఘటన.. తన తండ్రి అనారోగ్యంతో ఉండటంతో సైకిల్ పై తండ్రిని ఎక్కించుకుని.
1200 కిలోమీటర్లు ప్రయాణించిన సైక్లిస్ట్ జ్యోతి గురించి సోషల్ మీడియాలో రావడంతో ఆమెకి ప్రశంసలు వచ్చాయి, ఆమెని అందరూ అభినందించారు.. 60 రోజుల్లోనే జ్యోతి జీవితం మారిపోయింది. ఇల్లు కట్టుకుని తల్లిదండ్రులతో ఇక్కడే ఉండాలి అని అనుకుంటోంది.
గుర్గావ్ నుంచి బీహార్ లోని సీతామర్హి జిల్లాలోని తన ఇంటి వరకు తండ్రిని కూర్చోబెట్టుకుని సైకిల్ పై ప్రయాణించిన జ్యోతిని ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారు. ఆమెకి ఇప్పటి వరకూ ఆరులక్షల సాయం వచ్చింది… నాలుగు సైకిళ్లు అందాయి. దాంతో సీతామర్హి జిల్లాలోని శిరూలియా గ్రామంలో ఒక చిన్న ఇల్లు నిర్మించుకుంటున్నారు.. గడియారాలు, ఇతర బహుమతులు ఆమెకి ఇచ్చారు, ఆమె సైక్లిస్ట్ అవుదాము అని అనుకుంటోంది.