పర్చూరు రాజకీయాల్లో దగ్గుబాటి పేరు వైసీపీలో ఇటీవల వినిపిస్తోంది.. ఆయన పార్టీలో ఉంటారా లేదా పార్టీకి గుడ్ బై చెబుతారా అని రాజకీయంగా వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఆయనకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు అని చాలా మంది అన్నారు.. కాని సీనియర్ నేత మాజీ మంత్రి అలాగే అక్కడ అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుబాటికి జగన్ కీలక పదవి ఇవ్వనున్నారట.
ఆయన పేరు తాజాగా రాజ్యసభ సభ్యుల రేసులో కూడా వినిపిస్తోంది.. వైవీ, అయోధ్య రామిరెడ్డి, దగ్గుబాటి ,అలాగే బీద వీరి నలుగురిలో కచ్చితంగా దగ్గుబాటికి రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉంటుంది అంటున్నారు. మరి జగన్ ఆయనతో త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటారట.
లేదా దగ్గుబాటి తాను ఎమ్మెల్సీగా కొనసాగుతాను అంటే ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వనున్నారు అని తెలుస్తోంది. అయితే దగ్గుబాటికి జగన్ ఆప్షన్ వదిలేస్తున్నారు అని కొందరు సీనియర్లు అంటున్నారు. బయట మీడియాలో జరుగుతున్న ప్రచారం సరైనది కాదు అని ఆయన పార్టీలోనే ఉంటారు అని అంటున్నారు సీనియర్ లీడర్లు.