దగ్గుబాటి విషయంలో జగన్ సంచలన నిర్ణయం

దగ్గుబాటి విషయంలో జగన్ సంచలన నిర్ణయం

0
99

దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయంగా పర్చూరులో కీలక నేత, అయితే ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు జగన్ దగ్గర విలువ లేకుండా పోయింది అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కాని ఇందులో వాస్తవం లేదు అని తెలుస్తోంది. నిజంగా జగన్ దగ్గర అలాంటి పరిస్దతితి ఉంటే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉండేవారు.. ఆయన కుమారుడ్ని కూడా అమెరికా పంపేవారు. కాని రాజకీయంగా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు ఆయన.

కేవలం ఇది కొందరు టీడీపీ నేతలు ఆయనపై చేస్తున్న దుష్ప్రచారం అంటున్నారు.. ముఖ్యంగా వైసీపీ టీడీపీ నేతలు ఇక్కడ పార్టీలు మారుతున్నారు .. ఈ సమయంలో కొందరు కేడర్ పర్చూరులో దగ్గుబాటికి దూరం అవుతున్నారు.. రామనాథం బాబు వెంట ఉండేవారు కూడా కొందరు దగ్గుబాటి వెంట గతంలో వెళ్లారు..మళ్లీ రామనాధం బాబు ఎంట్రీతో ఆయన చెంతన చేరుతున్నారు.. అయితే దీని వల్ల పార్టీకి ప్లస్ అవుతోంది కాని పార్టీకి నష్టం ఎక్కడా లేదు.

అయితే దగ్గుబాటికి పార్టీలో సముచిత స్ధానం జగన్ ఇస్తారు అని కచ్చితంగా ఆయనని రాజ్యసభకు పంపే ఆలోచనలో ఉన్నారు అని సీనియర్లు అంటున్నారు. అందుకే అక్కడ రామనాథం బాబుకు పదవి ఇచ్చారు అని తెలుస్తోంది. ఒకవేళ ఆయన కుమారుడికి అక్కడ బాధ్యతలు ఇస్తే ఇద్దరికి రెండు కీలక పదవులు ఇచ్చినట్లు అవుతుంది అని జగన్ భావించారు అని తెలుస్తోంది