డేంజ‌ర్ లో ఉన్నాం డబ్ల్యూహెచ్ వో కీల‌క ప్ర‌క‌ట‌న

డేంజ‌ర్ లో ఉన్నాం డబ్ల్యూహెచ్ వో కీల‌క ప్ర‌క‌ట‌న

0
85

ఈ క‌రోనా వైర‌స్ మాన‌వాళిని ఎన్నో ఇబ్బందులకి గురిచేస్తోంది, దాదాపు 85 ల‌క్ష‌ల పాజిటీవ్ కేసులు ప్ర‌పంచ వ్యాప్తంగా న‌మోదు అయ్యాయి, ఇక ఈ వైర‌స్ కోటి మందికి వ‌చ్చే అవ‌కాశం ఉంది అంటున్నారు, మ‌ర‌ణాల రేటు కూ‌డా భ‌యంక‌రంగా ఉంటోంది, లాక్ డౌన్ ఉన్న స‌మ‌యంలో బాగానే ఉన్నా లాక్ డౌన్ తీసిన త‌ర్వాత మాత్రం కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి.

వైరస్ వ్యాప్తి అతకంతకూ విస్తరిస్తోంది. దీంతో ప్రపంచం కొత్త ప్రమాద దశలోకి వెళుతోంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో లక్షా 50 వేల కేసులు నమోదైనట్లు సంస్థ చీఫ్ టెడ్రెస్ అధనోమ్ తెలిపారు.

ఆర్దికంగా చాలా ఇబ్బంది అన్నీ దేశాల‌కు ఉంది… కాని ఇలా లాక్ డౌన్ స‌డ‌లింపుల‌తో కేసులు తీవ్ర‌త మ‌రింత పెరిగింది అంటున్నారుసగానికి పైగా కేసులు రెండు అమెరికా ఖండాలు, దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాల్లోనే నిర్ధారణ అయినట్లు అధనోమ్ అన్నారు. ఇక ప్ర‌తీ ఒక్క‌రు ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌త శుభ్ర‌త మాస్క్ ధ‌రించాలని తెలిపారు ఆయ‌న‌.