దారుణం ఈ డాక్ట‌ర్ కుటుంబానికి పెద్ద క‌ష్టం

దారుణం ఈ డాక్ట‌ర్ కుటుంబానికి పెద్ద క‌ష్టం

0
89

అతి దారుణం ఓ ప‌క్క కోవిడ్ సోకిన వారికి ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్ట‌ర్ల‌కు కూడా ఇప్పుడు క‌రోనా సోకుతోంది, మ‌రో ప‌క్క ఎవ‌రైనా జ‌లుబు ద‌గ్గు అని డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళుతుంటే వారు కూడా చూడ‌టం లేదు పెద్ద ఆస్ప‌త్రికి వెళ్లండి అని రిఫ‌ర్ చేస్తున్నారు.

అలాంటి దారుణమైన స్దితి మ‌న దేశంలో ఉంది. ఈశాన్య ఢిల్లీలోని ఓ మోహల్లా క్లినిక్ లో పనిచేస్తున్న డాక్టర్ కుటుంబమంతా కరోనా వ్యాధి బారిన పడటంతో మౌజ్ పూర్ లో తీవ్ర కలకలం రేగింది. దారుణం ఏమిటి అంటే వైద్యునితో పాటు అతని భార్య, కుమార్తెకు కూడా కరోనా సోకిందని, వారికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని వైద్యాధికారులు తెలిపారు.

ఇక ఆ డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు చికిత్స కు వెళ్లిన వారిని అంద‌రిని కూడా ప‌రిశీలిస్తున్నారు. దాదాపు వందలమంది ఉన్నారు అని తెలుస్తోంది, ఆయ‌న‌కు విదేశాల‌కు వెళ్లిన ట్రావెల్ హిస్ట‌రీ లేదు, కాని చికిత్స కు వ‌చ్చిన వారినుంచే ఆయ‌న‌కు పాకి ఉంటుంది అని అంటున్నారు వైద్యులు.