మనకు దసరా దీపావళి వస్తోంది అంటే మార్కెట్లో చాలా మంది కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తారు, అందుకే ఈ పండుగలకి ఆఫర్లు ఉంటాయి.. తాజాగా ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ షాపింగ్ డేస్ పేరుతో భారీ ఆఫర్లతో ముందుకొచ్చింది.
దీనిలో భాగంగా మొత్తం ఆరు నోకియా స్మార్ట్ టీవీలను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో 32, 43-, 50, 55 మరియు 65- అంగుళాల టీవీలు ఉన్నాయి. మరి ఈ కొత్త టీవీల ధరలు ఎలా ఉన్నాయి ఆఫర్లు ఏమిటి అనేది చూద్దాం
నోకియా స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ 9.0 మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్తో పనిచేస్తాయి. అల్ట్రా హెచ్డీ రేంజ్ 43 50-, 55, 65-అంగుళాల టీవీల్లో 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ను కలిగి ఉంది. నోకియా టీవీల్లో మూడు యుఎస్బి పోర్ట్లు, రెండు హెచ్డిఎమ్ఐ పోర్ట్తో పాటు బిల్ట్ ఇన్ వైఫై మరియు బ్లూటూత్ ఫీచర్లు ఉన్నాయి.
32 ఇంచెస్ నోకియా స్మార్ట్ టీవీ రూ .12,999
43 అంగుళాల హెచ్డీ- రూ .22,999
ఫుల్ హెచ్డీ వేరియంట్ టీవీ రూ .28,999
50 అంగుళాల టీవీ రూ .33,999,
55 అంగుళాల టీవీ రూ.39,999
65 అంగుళాల టీవీ రూ .59,999లు ఉంది.