ప్రతి ధాన్యం గింజ కొనాలంటూ సీఎం కేసీఆర్ పై దాసోజు ఫైర్..

0
102

‘కూటికోసం కోటి విద్యలనే మాటని ఓటు కోసం కోటి వేషాలుగా మార్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. అన్నదాతని పావుగా వాడుకొని తెలంగాణని మూడోసారి కబళించడానికి కేసీఆర్ చేసిన కుట్రలో భాగమే ఢిల్లీలో చేసిన దొంగ దీక్ష” అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో మాట్లాడారు దాసోజు. ఢిల్లీలో ధర్నా పేరుతో రైతులని దగా చేయడానికి కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేశారు. రంగస్థలం సినిమాలో రాత్రి చంపి పొద్దునే దండ తీసుకువచ్చి సంతాపం తెలిపే జగపతి బాబు విలన్ పాత్రలా కేసీఆర్ కూడా రైతులని అనేక రకాలు ఇబ్బందులు పెట్టి , రైతులు రెక్కల కష్టంతో పండించిన పంటలని దళారులకు అమ్ముకునే పరిస్థితులు తెప్పించి ఇవాళ రైతుల తరుపున దీక్ష చేస్తున్నాని కేసీఆర్ చెప్పడం అత్యంత దుర్మార్గం.

టీఆర్ఎస్. బిజేపీ రెండూ పార్టీలు నాటకాలుడుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్ , కేంద్రంలో అధికారంలో వున్న రెండు పార్టీ ధర్నాలు చేస్తే పని ఎవరు చేయాలి ? రైతులని ఎవరు ఆదుకోవాలి ? బిజెపికి అసలు అవగాహన లేకపోవడం ఒక ఎత్తైయితే, రైతుల విషయంలో కేసీఆర్ అవగాహన వుండి కూడా కుట్ర పూరితంగా రాజకీయం చేస్తున్నారు. మేము ఉప్పుడు బియ్యం ఇవ్వమని లెటర్ ఇచ్చింది కేసీఆర్, మోడీ ముందు బానిస చేతులు కట్టుకొని నిలుచున్నది కేసీఆర్, తెలంగాణలో ఎవరైన వరి వేస్తామని అంటే ఉరి వేస్తామని ఐఎస్ఎస్ అధికారులతో బెదిరింపులకు పాల్పడింది కేసీఆర్.. ఇన్ని రకాలు రైతులని ఇబ్బంది పెట్టిన కేసీఆర్ ఈ రోజు ఢిల్లీలో దొంగ దీక్షల పేరిట కుట్ర చేస్తున్నారు” అని మండిపడ్డారు దాసోజు”ఈ సమస్యని పరిష్కరించాలంటే ఇందిరా పార్క్ వద్ద దీక్షలు అవసరం లేదు.

నరేంద్ర మోడీ దగ్గర కూర్చుని అవుట్ ఫుట్ రేసియో పెంచమని అడిగితే సరిపోతుంది. ముడి బియ్యం ఇచ్చినట్లయితే క్వింటాల్ కి 68కిలోలు, ఉప్పుడు బియ్యం ఇచ్చినట్లయితే వచ్చే నష్టం 50 కిలోలు నష్టం .. అంటే దాదాపు వెయ్యి కోట్ల నష్టం జరుగుతుంది. అవుట్ పుట్ రేసియోలో క్వింటాల్ కి యాబై కిలోలు తగ్గించినట్లయితే ఈ సమస్య సులువుగా పరిష్కారం అవుతుంది. ఈ పాలసీ కోసం కొట్లాడమని చెబితే ఇందిరా పార్క్ దగ్గర డ్రామాలు చేస్తున్నారు. రా రైస్ ఇచ్చి వెయ్యి కోట్లు నష్టం మేము భరిస్తాం కానీ రైతులకు మాత్రం ఇబ్బంది కలగకుండా చూసేలా నిర్ణయం తీసుకోమంటే బిజేపీ డ్రామా ఆడుతుంది. ఇద్దరూ తెలంగాణని కబళించాలని చేస్తున్న కుట్రలో బాగమే ఈ దీక్ష” అని పేర్కొన్నారు దాసోజు. కేసీఆర్ చెప్పిన లెక్కల ప్రకారమే యాసంగిలో 80లక్షల మెట్రిక్ టన్నులు వరి ఉత్పత్తి వుంది. ఇందులో 50 లక్షల టన్నులు అమ్మకాని వస్తుంది.

ఈ యాబై లక్షల టన్నుల్లో ముడి బియ్యం ఇచ్చినట్లయితే 7.5లక్షల టన్నుల నూక వస్తుంది. 7.5లక్షల టన్నులకు 30వేల చొప్పున వేసుకుంటే 201 కోట్లు అవుతుంది. ఇందులో కూడా నూక సగం ధరకు వెళుతుంది. అంటే వెయ్యి కోట్లు మాత్రమే నష్టం. ఈ వెయ్యి కోట్లని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భరించవచ్చు .. ఇది చేయకుండా చిల్లర డ్రామాలు పాల్పడుతున్నారు. ఇంతకంటే దుర్మార్గం లేదు” అని మండిపడ్డారు దాసోజు కేసీఆర్ ధన్ హే క్యా మన్ హే క్యా అని మాట్లాడుతున్నారు. మరి తెలంగాణలో ధనం ఏమైయింది కేసీఆర్ గారూ ? ఎందుకు రైతుల పాలిట శాపంగా మారారు ? తెలంగాణ రైతు పరిస్థితి అగమ్య గోచరంగా వుంది. అనేక ఇబ్బందులు పడి అప్పులు చేసి రైతులు పంట పండించారు.

అప్పుల వాళ్ళు రైతుల ఇంటి ముందు కూర్చున్నారు. పంట పండింది. చేతికి వచ్చింది. కానీ కేసీఆర్ ఢిల్లీలో ఓట్ల డ్రామాలు చేస్తున్నారు. ఇంత అన్యాయమా ? రైతు పంట కళ్ళంలో వుంటే కేసీఆర్ ఢిల్లీలో ఎలా వుంటారు ? కేసీఆర్ నిజాయితీ వుంటే ఐకేపీ సెంటర్లు పెట్టాల్సింది, ప్రోక్యుర్మెంట్ మొదలవ్వల్సింది. ఇది చేయకుండా కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారు. ఈ పరిస్థితిని తెలంగాణ సమాజం గమనించాలి” అని కోరారు దాసోజు.”కేసీఆర్ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం రాకేష్ టికాయిత్ ని పక్కన కూర్చోబెట్టుకోవడం. రాకేష్ టికాయిత్ రైతు చట్టాలకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నప్పుడు కేసీఆర్ కనీస మదత్తు తెలపలేదు.

మోడీతో కలసి రైతు చట్టాలకు జై కొట్టారు. కానీ నేడు తను దీక్ష చేస్తున్నపుడు రాకేష్ టికాయిత్ ని పక్కన కూర్చుబెట్టుకున్నారు. ఇంతకంటే అవకాశవాద రాజకీయం వుంటుందా ? అని ప్రశ్నించారు.”సమస్యని సృస్టించింది కేసీఆర్. ఆ సమస్యకు పరిష్కారం కూడా తన దగ్గర వుందని కేసీఆర్ మాటల్లో స్పస్టమైయింది. గతంలో కూడా ఆర్టీసి, మన్రేగా ఫీల్డ్ అసిస్టెంట్లు, సింగరేణి కార్మికులు, పీఆర్సి .. విషయంలో ఉద్యోగులు కార్మికులు ఎంతో హైరానా పడి, అనేక కష్టాలు ఎదురుకున్న తర్వాత చివర్లో తనేదో నజరానా ప్రకరిస్తున్నట్లు సమస్యని పరిష్కరించినట్లు అహంకారంతో కూడిన వైఖరి ప్రదర్శించారు.

ఈ రోజు రైతుల విషయంలో అదే జరగబోతుంది. క్యాబినెట్ మీటింగ్ కి పిలిచి మోడీ కొనలేదు కాబట్టి నేనే కొంటా అనే ఏదో నజరానా ప్రకటించినట్లు చెబుతారు. నిజానికి ఇక్కడ సమస్య సృస్టించింది కేసీఆర్. ఎవరినీ సంప్రదించకుండా రా రైస్ ఇవ్వబోమని కేంద్రానికి లేఖ ఇచ్చింది కేసీఆర్. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి” అని వెల్లడించారు దాసోజు ఇప్పటికే 30 శాతం పంట నష్టానికి అమ్ముకున్నారు రైతులు. మరి ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి. కేసీఆర్ కుట్ర రాజకీయాల వలన నష్టపోయిన రైతులకు మదత్తు ధర ఎవరు ఇవ్వాలి ? వారిని ఎవరు ఆదుకోవాలి ? కేసీఆర్ కి నిజాయితీ వుంటే ఇప్పటికే పంట అమ్మి నష్టపోయిన రైతులకు మదత్తు ధర వచ్చేలా వారి నష్టాలని పూడ్చేలే చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.

”రాజకీయం అంతా దుర్మార్గంగా మార్చారు కేసీఆర్. ప్రతిది ఒక ఈవెంట్ మ్యానేజ్మెంట్ లా చేస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే కేంద్రానికి వినపడదా ? అయితే ఒక వేదిక, పెద్ద మైక్ సెట్లు, జనాలని సమీకరించి ఒక ఈవెంట్ చేసి ప్రజలని మభ్యపెట్టాలనే కుట్ర చేస్తున్నారు కేసీఆర్. రక్తాన్ని చెమటగా మార్చి అన్నం పెడుతున్న రైతన్న తో రాజకీయం చేయడం నీచాతి నీచం. మీ డ్రామాల కోసం రైతులని ఎందుకు వాడుకుంటున్నారు కేసీఆర్ ? దయచేసి మీ క్షుద్ర రాజకీయాలని పక్కనే పెట్టి ప్రతి ధాన్యం గింజ కోనెలా చర్యలు తీసుకోవాలి” అని కోరారు దాసోజు.