తప్పైందని కేసిఆర్ ముక్కు నేలకు రాయాలి

0
118

తెలంగాణ సిఎం కేసిఆర్ పై ఎఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గాంధీభవన్ లో శనివారం జరిగిన దళిత ఆవేదన దీక్షలో శ్రవణ్ పాల్గొని మాట్లాడారు. నాడు తెలంగాణ ఉద్యమ జ్వాలలు రగిల్చింది దళితులే అన్నారు దాసోజు. తెలంగాణ వచ్చింది దళితులు వల్లే అనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. తెలంగాణ కోసం అమరులైన 1500 వందల మందిలో దళితులే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. నిన్న బట్టి విక్రమార్కకు కెసిఆర్ భయపడ్డాడని.. అందుకే లాకప్ డెత్ లో చనిపోయిన మరియమ్మ మృతికి ఎక్స్ గ్రేషియా ప్రకటించారని పేర్కొన్నారు.

మరియమ్మ తో మొదలైన ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు. మరియమ్మకి 15 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తే సరిపోదని, చనిపోయిన 116 మంది దళితులకు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. తప్పు అయింది అని కెసిఆర్ క్షమాపణ చెప్పి ముక్కు నెలకి రాయాలన్నారు. దళితులం బానిసలు కాదు ..ప్రభుత్వంతో  కొట్లాడాలి అని పిలుపునిచ్చారు. నేరెళ్ల బాధితులకి ఎం న్యాయం చేస్తావు కెసిఆర్ అని నిలదీశారు. నేరెళ్ల బాధితుల కోసం ఆనాడు మాజీ స్పీకర్ మీరాకుమారి అపాయింట్మెంట్ అడిగితే కేసిఆర్ ఇవ్వని విషయాన్ని దాసోజు గుర్తు చేశారు. దళితులకి ఇవ్వడానికి భూములు లేవు కాని ప్రయివేట్ సంస్థలకి వేల ఎకరాలు ఎట్లా ఇస్తున్నారని ప్రశ్నించారు.