మోదీ ఎంట్రీకి డేట్ ఫిక్స్

-

శ్రీరాముడు దేవాలయం భూమి పూజలు వచ్చే నెల 5 వ తేదీన నిర్వహించేందుకు రామజన్మభూమి తీర్థ ట్రస్టు సిద్ధవుతోంది. ఆగస్టు 5 వ తేదీన ఉత్తర ప్రదేశ్ లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన పురస్కరించుకొని అదే రోజు రామాలయానికి భూమి పూజ చేపట్టాలని రామజన్మ భూమి తీర్థ ట్రస్టు నిర్ణయించింది. దీనిపై చర్చించేందుకు ఈ నెల 18 న రామజన్మభూమి తీర్థ ట్రస్టు సభ్యులు సమావేశం కానున్నారు.

- Advertisement -

అయోధ్య శ్రీరాముడు ఆలయం భూమిపూజకు రావాల్సిందిగా ఇప్పటికే ట్రస్టు సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. దీంతో ఆ మేరకు అధికారులు ప్రధాని పర్యటన ఖరారు చేసినట్టు సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భూమిపూజ కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహించాలని ట్రస్టు నిర్ణయించింది. ఈ రోజు సమావేశమై భూమిపూజ తేదీని ట్రస్టు ప్రకటించింది.

ట్రస్టు సమావేశానికి ముందు భవన నిర్మాణ నిపుణులతో, సన్యాసులతో కూడా భూమి పూజ తేదీపై చర్చించనున్నారు. అయోధ్య రామాలయం భూమి పూజా కార్యక్రమానికి ప్రధాని మోదీ వచ్చే నెల 3 లేదా 5 న హాజరవుతారని ట్రస్ట్ అధ్యక్షుడు సంత్ నిత్య గోపాల్ దాస్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

MLC Kavitha | ప్రభుత్వ విద్యార్థులను పట్టించుకోవాలి.. కవిత డిమాండ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు....

MLC Jayamangala | వైసీపీకి మరో షాక్.. ఎమ్మెల్సీ రాజీనామా..

వైసీపీ(YCP)లో రాజీనామాల పర్వానికి ఇప్పుడప్పుడే తెరపడేలా కనిపించడం లేదు. ఒకరి తర్వాత...