సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు… కాస్త ఆదమరిచి ఉన్నా మొత్తం నగదు దోచేస్తున్నారు బ్యాంకు అకౌంట్ల నుంచి.. అందుకే ఎలాంటి డేటా తెలియని వారికి షేర్ చేయకండి. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తెనే సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. బ్యాంక్ అకౌంట్లో నుంచి రూ.34,000 కొట్టేశారు ఇప్పుడు ఈ కేసుపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షితా కేజ్రీవాల్ ప్రముఖ ఆన్లైన్ స్టోర్ ఓఎల్ఎక్స్ OLXలో సెకండ్ హ్యాండ్ సోఫాను అమ్మడానికి ప్రయత్నించారు, ఈ సమయంలో ఓ వ్యక్తి ఆమెని కాంటాక్ట్ అయ్యాడు, డబ్బులు పంపిస్తా అని చెప్పి
ఓ బార్ కోడ్ను స్కాన్ చేయాల్సిందిగా లింక్ పంపించాడు.
హర్షితకు నమ్మకం కుదర్చడానికి ముందు చిన్న మొత్తం నగదు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇలా రెండుసార్లు ఆమె అకౌంట్ నుంచి 34 వేలు కొట్టేశాడు, ముందు 20 వేలు తర్వాత 14000 దోచేశాడు, వెంటనే ఆమె పోలీసులకి ఫిర్యాదు చేశారు..కేజ్రీవాల్ కుమార్తె హర్షిత ఐఐటీ, ఢిల్లీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేశారు.