పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ టిఆర్ఎస్ కార్పొరేటర్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. నేడు గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నేను పదవుల కోసం పార్టీ మారలేదు. నేటికీ మహిళలపై అఘాయిత్యాలు ఆగలేదు. షీ టీం లు పెట్టామని చెప్పుకుంటున్న హైదరాబాద్ లో జరిగిన ఘటనలు నన్ను తీవ్రంగా బాధించాయి. TRS సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పుకొచ్చారు.
ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ..ప్రతీ పేదవాడి గుండెలో ఉండే నేత పీజేఆర్. హైదరాబాద్ కాంగ్రెస్ కొంత వీక్ ఉన్న సమయంలో ఆయన కూతురు విజయారెడ్డి పార్టీలోకి రావడం సంతోషం..ఎంతోమంది పేదలకు పీజేఆర్ ఇళ్ల పట్టాలు ఇప్పించారు. ఆయన కూతురు విజయారెడ్డికి మంచి భవిష్యత్ ఉంది. ఖైరతాబాద్ సహా ఎక్కడ పోటీ చేసినా ఆమె గెలుస్తుంది.
కాంగ్రెస్ ను గెలిపించుకుంటేనే పీజేఆర్ కు నిజమైన నివాళి. కాంగ్రెస్ డిమాండ్ తో రైతుబంధు ఇస్తానని హామీ ఇచ్చారు. వరి కొని రెండు నెలలు దాటినా ఇంకా రైతులకు డబ్బులు రాలేదు. మెట్రో, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కాంగ్రెస్ కృషితోనే వచ్చాయన్నారు.