డీసీపీపై 500 మంది కానిస్టేబుళ్ల దాడి కార‌ణం ఇదే

డీసీపీపై 500 మంది కానిస్టేబుళ్ల దాడి కార‌ణం ఇదే

0
86

ఓ పోలీస్ ఉన్న‌త అధికారి కానిస్టేబుల్స్ స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోలేదు ఇష్టం వ‌చ్చిన విధంగా వారికి డ్యూటీ వేశాడు… దీంతో త‌మ బాధ చెప్పుకోవ‌డానికి ఆ డీసీపీ అధికారి ఉన్న బిల్డింగ్ ద‌గ్గ‌ర‌కు 500 మంది కానిస్టేబుల్స్ వ‌చ్చారు.

అప్పటికే అసహనంతో ఉన్న ఆ కానిస్టేబుళ్లు ఆయనతో చర్చలు జరిపారు.. ఈ క్రమంలో కానిస్టేబుళ్లు ఆగ్రహానికి గురై ఆ డీసీపీపై దాడికి దిగారు.. ప్రాణ భయంతో ఆ డీసీపీ పరుగులు తీయాల్సి వచ్చింది.. ఇది బెంగాల్ లో జ‌రిగింది, చివ‌రకు ఆయ‌న్ని సెక్యూరిటీ సిబ్బంది సుర‌క్షిత ప్రాంతానికి తీసుకువెళ్లారు.

ఉమ్ పున్ తుఫాను కారణంగా సహాయక చర్యల కోసం 500 మంది కానిస్టేబుళ్లకు ఆన్ డ్యూటీ వేశారు. అయితే, వాళ్లు బ్యారక్‌లోనే ఉంటున్న ఓ ఎస్సైకి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అయినా..ప‌ట్టించుకోలేదు, అంతేకాదు శానిటైజేష‌న్ చేయ‌లేదు దీంతో ఆ పోలీస్ అధికారిపై కోపంతో ఈ ప‌ని చేశారు..మాస్కులు లేవ‌ని శానిటైజ‌ర్లు లేవ‌ని స‌రైన జాగ్ర‌త్త‌లు పాటిద్దామ‌న్నా మాకు ఇలాంటి వ‌స్తువులు ఇవ్వ‌డం లేద‌ని ఫ్రంట్ లైన్ లో ప‌ని చేస్తున్న మాకు ఏమైనా అయితే ఎవ‌రు చూస్తారు అని అంటున్నారు.