మన దేశంలో చాలా మంది పాన్ కార్డ్ తీసుకుంటారు . ఇక పాన్ కార్డ్ కూడా బ్యాంకు అకౌంట్ కి అలాగే ఆర్దిక లావాదేవీలకు కచ్చితంగా కావాలి. ఇక మనం బండి నడిపితే కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాల్సిందే. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనం ఫ్రూప్ కింద కూడా చూపిస్తాం. ఇక పాస్ పోర్ట్ కూడా మనం ఇతర దేశాలు వెళ్లాలి అంటే కచ్చితంగా ఉండాల్సిందే.
ఇవన్నీ చాలా కీలకమైన డాక్యుమెంట్లు. అయితే చనిపోయిన వ్యక్తికి సంబంధించి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ , పాస్ పోర్టు వంటి ధ్రువపత్రాల విషయానికి వస్తే వాటికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.
ఎవరైనా వ్యక్తి మరణిస్తే అతని పాన్ కార్డ్ ఏం చేయాలి అంటే కచ్చితంగా అతని పాన్ కార్డును ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో అప్పగించాలి అనే నిబంధన ఉంది.
ఇక డ్రైవింగ్ లైసెన్స్ కూడా నిర్ణిత సమయం ఉంటుంది అంటే అవి ఫోర్సులో కొన్ని ఏళ్లు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత రెన్యువల్ చేసుకుంటాం. పాస్ పోర్టు కు సంబంధించి అందులో నిర్ణీత కాల వ్యవధి వరకు మాత్రమే అవి ఫోర్సులో ఉంటాయనేది తెలిసిందే. మళ్లీ మనం రెన్యువల్ చేసుకోలేదు అంటే ఇక అవి రద్దైపోతాయి. చనిపోయిన వ్యక్తి ఇక రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి అవి నేరుగా రద్దు అవుతాయి.