ముగిసిన నామినేషన్ల గడువు..ఎన్నికలకు దూరంగా భాజపా..2 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ

Deadline for nominations..BJP away from elections..Congress contest in 2 seats

0
90

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కొలాహలం నెలకొన్న సంగతి తెలిసిందే. నిన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కాగా నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.

ఉమ్మడి మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తూర్పు విజయనిర్మల రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నర్సా రెడ్డి , పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి జిల్లా కౌన్సిలర్ లు, ఎంపీటీసీ, జెట్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

ఈ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు భాజపా ఎన్నికలకు దూరంగా ఉండగా.. కాంగ్రెస్​ కేవలం 2 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఖమ్మం, మెదక్​ స్థానాల్లోనే కాంగ్రెస్​ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఖమ్మంలో ఆ పార్టీ తరఫున నాగేశ్వరరావు, మెదక్​లో నిర్మల నామపత్రాలు సమర్పించారు.