దెబ్బకు పవన్ ఆశలు ఆవిరైపోతున్నాయిగా…

దెబ్బకు పవన్ ఆశలు ఆవిరైపోతున్నాయిగా...

0
68

కరోనావైరస్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ ను కన్ఫ్యూజ్ చేసిందని అందరు చర్చించుకుంటున్నారు… ఆయన పొలిటికల్ యాక్షన్ ప్లాన్ లకు బిగ్ బ్రేక్ వేసిందట ఈ మాయదారి మహమ్మారి… ఆయన కళలు కన్న కోరికలకు కళ్లెం వేసిందట… 2024 ఎన్నికల కోసం పవన్ కలలుకన్నారు… వాటిని ఎలా నిజం చేసుకోవాలని చూశారు… కానీ కరోనా మహమ్మారి చిరిగి చేటచేసింది… ఇప్పట్లో ఏమీ చేయకుండా బంధించింది…

దాంతో మొత్తం సీన్ రివర్స్ అయింది… పవన్ రానున్న మూడేళ్లు వరుసగా సినిమాలు చేసుకోవాలని 2020 లో ఓ శుముహూర్తాన ముఖానికి రంగు వేసుకున్నాడు… ఆయన ప్లాన్ ప్రకారం ఏడాదికి రెండు సినిమాలు పూర్తి చేయాలి… మూడవది పట్టాలెక్కించాలి… ఇక వచ్చే ఏడాది కూడా ఇదే జోరు మరో మూడు సినిమాలు చేయాలని ఇలా బ్యాక్ టూ బ్యాక్ అరడజన్ సినిమాలు అయినా చేసి 200 కోట్లు రూపాయల వెనకేసుకోవలాని అనుకున్నారట..

ఆమొత్తాన్ని రాజకీయ పెట్టుబడిగా పెట్టి 2024 ఎన్నికల బరిలో దిగాలనేది ఆయన ప్లాన్… అయితే కరోనా కారణంగా ఇప్పట్లో సినిమాలు మొదలయ్యే ఛాన్స్ లేదు మొత్తానికి ఈ ఏడాది… ఒక సినిమా మాత్రమే పవన్ పూర్తి చేస్తారేమో… కరోనా దెబ్బకు పారితోషకం కూడా భారీగా కటింగ్ అవుతుందట… అంటే సగానికి సగం తగ్గించుకోవాలి… ఈ విధంగా సినిమాలు ద్వారా అర్జించి పార్టీని అర్థికంగా బలోపేతం చేసుకుందామన్న పవన్ ఆశలు ఆగిపోయినట్లే అని అంటున్నారు…