ఆర్. బీ. ఐ. తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది.. మీరు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వాడుతూ ఉన్నారా, ఇక డిజిటల్ పేమెంట్స్ పెంచాలనే లక్ష్యంతో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చాలా వరకూ పేమెంట్లు ఆన్ లైన్ డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి, ఈ లాక్ డౌన్ వేళ కాంటాక్ట్లెస్ కార్డుల ట్రాన్సాక్షన్ భారీగా జరిగింది.
అయితే తాజాగా ఈ లిమిట్ ని పెంచారు, ప్రస్తుతం ఉన్న రూ.2,000 నుంచి రూ.5,000 వరకు పెంచుతున్నట్లు వివరించింది ఆర్బీఐ. అంటే రూ.5 వేల వరకు ట్రాన్సాక్షన్లకు ఇకపై పిన్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. మీరు ఏదైనా కొనుగోలు చేసినా ఏదైనా అమ్మకాలు జరిపినా నగదు పంపే సమయంలో ఇక పిన్ ఎంటర్ చేయకుండా ఐదు వేల వరకూ పంపించవచ్చు.
సో ఇది కరోనా సమయంలో మంచి లాభసాటిగా అందరికి మారింది,ఇలా చాలా మంది ట్రాన్సాక్షన్లు చేశారు.
ఈ కొత్త రూల్స్ జనవరి 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం చాలా బ్యాంకులు వారి కస్టమర్లకు కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులను జారీ చేస్తున్నాయి, కొత్తగా మీరు తీసుకోవచ్చు. ఇక బ్యాంకులు ఆర్టీజీఎస్ సర్వీస్ ని 24 గంటలు అందిస్తున్న విషయం తెలిసిందే.