డిసెంబర్ 1 నుంచి బ్యాంకు కస్టమర్లకు కొత్త రూల్ తప్పక తెలుసుకోండి

డిసెంబర్ 1 నుంచి బ్యాంకు కస్టమర్లకు కొత్త రూల్ తప్పక తెలుసుకోండి

0
98

ప్రతీ నెలా కచ్చితంగా ఒకటో తేది వచ్చింది అంటే, బ్యాంకు ఖాతాదారులకి కొత్త రూల్స్ వస్తూ ఉంటాయి, ప్రతీ నెలా ఒకటో వారంలో ఇవన్నీ రూల్స్ మారుతూ ఉంటాయి, అయితే ప్రభుత్వ బ్యాంకు లేదా ప్రైవేట్ బ్యాంకు ఏదీ తీసుకున్నా ఇలాంటి రూల్స్ కామన్ అనే చెప్పాలి, ఇక డెబిట్ క్రెడిట్ కార్డులు బ్యాంకు లావాదేవీలు వడ్డీలు ఆఫర్లు ఇలా అనేక కొత్త డెసిషన్లు ఒకటో తేది నుంచి బ్యాంకులు అమలు చేస్తాయి.

తాజాగా మీకు డిసెంబర్ 1 నుంచి కొన్ని రూల్స్ అమలులోకి వస్తున్నాయి అవి ఏమిటో చూద్దాం..RTGS సర్వీసులు ప్రతి రోజూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని ఇప్పటికే ఆర్బీఐ తెలిపింది, ఇక వచ్చే నెల అంటే డిసెంబర్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుంది…ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉన్న RTGS సర్వీసులు24 గంటలు ఉంటాయి.

ఇక బ్యాంకు ఖాతాదారులు ఆర్టీజీఎస్ ద్వారా ఎక్కువ డబ్బులను వెంటనే ఇతరులకు పంపొచ్చు. కనీసం రూ.2 లక్షలు పంపాల్సి ఉంటుంది. మీరు ఆన్ లైన్ లో ఇలా పంపితే ఎలాంటి ఛార్జీలు ఉండవు, ఒకవేళ మీరు బ్యాంకుకు వెళ్లి పంపిస్తే దానికి చార్జీలు వసూలు చేస్తారు.. అలాగే మీరు రూ.2 లక్షలకులోపు డబ్బులు పంపాలంటే నెఫ్ట్ ద్వారా పంపించుకోవచ్చు. ఈ రూల్ డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది.