డిసెంబరులో ఖాతాలో 2000 – రాకపోతే రైతులు ఇలా చేయండి

డిసెంబరులో ఖాతాలో 2000 - రాకపోతే రైతులు ఇలా చేయండి

0
150

కేంద్రం రైతులకి అండగా ఎన్నో పథకాలు అమలు చేస్తోంది, ఇక మోదీ సర్కార్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి తీసుకువచ్చారు, రైతులకి ఆర్ధికంగా ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు, ఈ స్కీమ్ నిధులు డిసెంబర్ లో రానున్నాయి, రైతుల ఖాతాలో రెండు వేలు జమ చేస్తారు.

ఏప్రిల్-జులై మధ్య కాలానికి మొదటి విడత నిధులు వచ్చాయి… ఆగస్ట్ నుంచి నవంబర్ నాటికి రెండో విడత నిధులు ఇచ్చారు. మూడో విడత డిసెంబర్ నుంచి మార్చి వరకూ ఉంటుంది. మీకు డిసెంబరులో నగదు జమ అవుతుంది, ఒకవేళ ఈ నగదు మీకు గత విడతల్లో వచ్చినట్లు అయితే కచ్చితంగా డిసెంబరులో మీకు ఖాతాలో క్రెడిట్ అవుతుంది. ఒకవేళ జమ కాలేదు అంటే టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్లు గుర్తించండి, వెంటనే ఇలా చేస్తే మీకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది.

011-24300606 హెల్ప్ లైన్ నంబర్కి కాల్ చేసి మీ సమస్య చెప్పవచ్చు.
పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నంబర్: 18001155266
పీఎం కిసాన్ ఈమెయిల్ ఐడీ: pmkisan-ict@gov.in దీనికి మెయిల్ చేసి అయిన మీ ప్రాబ్లం చెప్పవచ్చు