Flash: టీడీపీలో తీవ్ర విషాదం..మాజీ మంత్రి కన్నుమూత

0
75

ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత జేఆర్ పుష్పరాజ్ అనారోగ్యంతో కన్నుమూశారు. జేఆర్ పుష్పరాజ్ గత సంవత్సరం కరోనా బారిన పడ్డారు. దాని నుంచి కోలుకున్నా, ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జేఆర్ పుష్పరాజ్ మృతి దిగ్భ్రాంతి కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని చంద్రబాబు పేర్కొన్నారు.