Flash: పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ ఓటమి

0
92

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ప్రభావం చూపించలేకపోయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పంజాబ్​లోనూ చేతులెత్తేసింది కాంగ్రెస్. అక్కడ ఆమ్​ఆద్మీ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. తాజాగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ఓటమి పాలయ్యారు. పాటియాలా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఆప్‌ అభ్యర్థి అజిత్‌ పాల్‌ సింగ్‌ కోహ్లీ చేతిలో 19, 797 ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు.