‘రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ ను శిక్షించాలి’

0
71
Telangana Congress Party

సికింద్రాబాద్ లో జరిగిన పోలీసుల కాల్పుల్లో  దామెర రాకేష్ చనిపోయాడు. రాకేష్ మరణ వాంగ్మూలంలో  రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ తన మరణానికి కారణం అని స్టేట్మెంట్ ఇచ్చి చచ్చి పోయిండు Under Section-32(1) of Indian Evidence Act, 1872 కింద రాజనాధ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి బక్క జడ్సన్ ఏఐసీసీ మెంబెర్ కోరారు.

అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారులు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీనికి మోడీ ప్రభుత్వం నిరుద్యోగులను పెంచడమే. పోలీసుల కాల్పుల్లో వరంగల్  జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందిన వరంగల్‌ జిల్లాకు చెందిన దామోదర్‌ రాకేశ్‌ రాజనాధ్ సింగ్ కారణం అని చెప్పాడు. కావున మంత్రి వెంటనే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాము, ఈ కాల్పులకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందా లేక ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందా ? కార్గిల్ యుద్ధ వీరుడు జనరల్ భక్ష్ అగ్నిపత్ వల్ల దేశ భద్రతకె ముప్పు అని తెలిపాడు. రాకేష్ పార్దివ దేహం అంతిమ యాత్రలో జాతీయ జెండాకు బదులు తెరాస పార్టీ జెండాలు పెట్టడం సిగ్గు చేటు.

గతంలో వరంగల్ కు చెందిన బోడ సునీల్ తన మరణ వాంగ్మూలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పేరు చేపిండు, రెండు నెలల కింద ఖమ్మం జిల్లాలో సాయి గణేష్ తన మరణ వాంగ్మూలంలో మంత్రి పువ్వాడ అజయ్ పేరు చెప్పి చనిపోయిండు ఇంత వరకు చర్యలు లేవు.

డీజీపీకి వినతి పత్రం ఇచ్చిన వారిలో ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉజ్మ్ షాకీర్, కేకేసీ చైర్మన్ లక్ష్మణ్ కుర్మా,తెలంగాణ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కందుకూరి హరీష్వర్ధన్, దుగ్యాల వేణు తదితరులు పాల్గొన్నారు.