ఎన్నికల వేళ రాజకీయంగా నేతలు గెలుపు కోసం ఎన్నో ఆరోపణలు చేస్తారు.. ఇదంతా ప్రజలకు కూడా తెలిసిందే.. ఇప్పుడు హస్తిన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, దీంతో ఢిల్లీలో పెద్ద ఎత్తున నేతలు ప్రచారాలు చేస్తున్నారు, అన్నీ పార్టీలు ఇక్కడ ప్రచారాల జోరు చూపిస్తున్నాయి, ఇక మరోసారి ఆప్ గెలుస్తుందా లేదా బీజేపీకి అవకాశం వస్తుందా అనేది ఇక్కడ చర్చ జరుగుతోంది.
ఈ రెండు పార్టీల మధ్య పోరు కూడా కనిపిస్తోంది. తాజాగా ఈ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా బీజేపీ నేతలు ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ను ఉగ్రవాది అంటూ వ్యాఖ్యానించడంపై ఆయన కుమార్తె హర్షిత కేజ్రీవాల్ బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా ప్రశ్నలకు తావిస్తున్నాయి.
నా తండ్రి ఎప్పుడూ సామాజిక సేవలు చేస్తారు…నా తండ్రి నన్నూ, నా సోదరుడిని తెల్లవారుజామున నిద్ర లేపి భగవద్గీత చదవి వినిపించేవారు…ఇలా భగవద్గీత నేర్పిన నా తండ్రి ఉగ్రవాదా? అని హర్షిత కేజ్రీవాల్ ప్రశ్నించారు. పేదలకు ఉచిత సౌకర్యాలు కల్పించి మంచి విద్యావంతులని చేస్తున్న నా తండ్రి ఉగ్రవాదా, ప్రజలకు మంచి పాలన అందించి సౌకర్యాలు కల్పించే వారిని ఉగ్రవాది అని పిలుస్తారా అని బీజేపీ నేతలకి కౌంటర్ ఇచ్చారు. దీనిపై బీజేపీ నేతలు సమాధానం చెప్పడం లేదు.