ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరగనుంది, ఈ ఎన్నికల్లో మొత్తం కోటీ 47 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు.
ఇక నువ్వా నేనా అనేలా ప్రచారం అయితే చేశాయి.. రాజకీయ పార్టీలు… ఆప్ బీజేపీ మధ్య ఇక్కడ ప్రధాన పోటీ ఉందని చెప్పాలి, ఎన్నికలు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.. 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 672 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రాతినిథ్యం వహించే న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీజేపీ కూడా ప్రతీ చోటా బలమైన నేతల్ని దింపింది.
69 వేల మంది పోలీసులు ఇక్కడ భద్రతలో ఉన్నారు. పటేల్ నగర్ నుంచి కేవలం నలుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. ఈ నెల 11న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.. ఉదయం నాలుగు గంటల నుంచి అన్నీ మెట్రో సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఇక్కడ గెలుపు పై సర్వే రిపోర్టులు మాత్రం టఫ్ వార్ అని వెల్లడించాయి.