ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం..ఆంక్షల సడలింపు..స్కూళ్లు రిఓపెన్

0
100
AP Inter exams Schedule

ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ( డీడీఎంఏ) కరోనా ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది.

ముఖ్యంగా చాలా రోజుల నుంచి మూతపడ్డ స్కూళ్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ నుండి 9-12వ తరగతులకు… నర్సరీ నుండి 8వ తరగతి వరకు ఫిబ్రవరి 14 నుండి బడులను పాఠాలు మొదలు కానున్నాయి. అలాగే అన్ని రెస్టారెంట్లు రాత్రి 11 గంటల వరకు తెరిచేందుకు అనుమతి లభించింది. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు 100% సామర్థ్యంతో పనిచేయడానికి పర్మిషన్లు వచ్చాయి. జిమ్‌లు మరియు స్విమ్మింగ్ పూల్స్ కూడా పూర్తిగా తెరవనున్నారు.

మరోవైపు రాత్రి కర్ఫ్యూను ఒక గంట తగ్గించి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయనున్నారు. గత కొంత కాలంగా ఢిల్లీలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆంక్షలు సడలించాలంటూ.. ప్రభుత్వంతో ప్రజలు కోరుతున్నారు. తాజాగా ఈ అనుమతులతో సాధారణ పరిస్థితులు నెలకొననున్నాయి.