ఏపీలో వైసీపీ ఎంపీకి ఓ కీలక పదవి వరించింది, అది కూడా దేశ రాజధాని హస్తినలో.. మరి ఆ పదవి ఏమిటి ఏ ఎంపీకి ఈ పదవి వచ్చింది అనేది చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ ఎంపీ బాలశౌరికి ఢిల్లీలో కీలక పదవి దక్కింది.. సౌమ్యుడిగా పేరు ఉన్న నాయకుడు ఎంపీ బాలశౌరీ, ఆయనకు తాజాగా
పబ్లిక్ అకౌంట్ కమిటీ సభ్యుడిగా అవకాశం వచ్చింది.
దీంతో ఆయనని పలువురు అభినందించారు, ఇక ఆయన 2020-21 ఆర్ధిక సంవత్సరానికిగాను ఎన్నికయ్యారు, ఈ ఏడాది పాటు ఆయన కొనసాగనున్నారు, ఇక ఆయన మచిలీపట్నం నుంచి ఈసారి ఎంపీగా గెలిచారు.
తాజాగా ఆయన నియామకం పై పబ్లిక్ అకౌంట్ కమిటీ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. లోకసభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరిని పీఏసీ ఛైర్‌పర్సన్‌గా స్పీకర్ ఓం బిర్లా నియమించారు. దీనిపై వైసీపీ నేతలు అభినందిస్తున్నారు.