అమ్మాయిలు సన్నగా ఉంటే అది అందంగా భావిస్తారు, ఎంత సన్నగా ఉంటే అంత మంచిది అని ఇంకా అందం రెట్టింపు అవుతుంది అని భావిస్తారు..,ఇక అబ్బాయిలు కూడా ఇలాంటి అమ్మాయిలని లైక్ చేస్తారు… జీరో సైజుతో ఉంటే చాలు.. మాకంటే అందగత్తెలు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని అనుకుంటూ ఉంటారు అమ్మాయిలు.. ఇక చాలా మంది జిమ్ కి వెళుతూ వ్యాయామాలు చేస్తూ సన్నగా అవ్వడానికి ప్రయత్నిస్తారు.
కాని ఒక దేశంలో అమ్మాయిలు మాత్రం లావుగా ఉంటేనే అందంగా ఉన్నట్లు అనుకుంటారట.. ఇదెక్కడ వింతరా బాబు అనుకుంటున్నారా …నిజమే ఇలాంటి ప్రాంతం ఉంది. మారేటేనియా అనే దేశం ఇక్కడ దేశ ప్రజలు అమ్మాయిలు లావుగా ఉంటేనే అందం అని నమ్ముతారట.
ఇక వివాహం కూడా లావుగా ఉన్న అమ్మాయిలని చేసుకుంటారు. సన్నగా ఉన్నవారిని పెళ్లి చేసుకోరు. ఆ దేశంలో అమ్మాయిలు లావుగా ఉన్నారు అంటే వారు చాలా అందంగా ఉన్నారని అర్థం. ఎవరైనా సన్నగా ఉంటే అస్సలు వారిని పట్టించుకోరు..అక్కడ లావు చేసే సెంటర్లు కూడా చాలా ఉన్నాయి, అనేక రకాల ఫుడ్ కూడా తిని లావు అవుతారు పొట్ట పెంచకుండా జిమ్ చేస్తారు. అయితే ఏనాటి నుంచో ఈ పద్దతి దేశంలో అలవాటులో ఉందట.