బాసర IIIT లో ఫుడ్ పాయిజన్ అయి 600 పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీనితో వారిని హుటాహుటీన నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో సర్కార్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..నిన్న రాత్రి భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం వర్సిటీలను పూర్తిగా నిర్వీర్య చేస్తోంది. గతంలో సీఎంకు లేఖ రాసినా పట్టించుకోవడం లేదు. వైస్ ఛాన్స్‌లర్ లేరు.. కామన్ మెస్ ఉంది. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి. మెస్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ప్రతిపక్షాలు కేసీఆర్‌తో ములాఖత్ అయ్యాయని విమర్శించారు.
ఇక ఈ ఘటనపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్క ఠాగూర్ స్పందించారు. రాష్ట్రంలోని విద్యార్థులను విద్యాశాఖ మంత్రి పట్టించుకోవటం లేదని.. ఇతర అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను పట్టించుకోని తెరాసకు రోజులు దగ్గర పడ్డాయి. జేబులు నింపుకోవడంపైనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ ఉంది. కుమారుడు, అల్లుడు రాజ్యం అంతమవ్వాలన్నారు.