ఈ ప్రపంచంలో మొబైల్స్ నెట్ వచ్చిన తర్వాత అరచేతిలో అన్ని తెలిసిపోతున్నాయి..సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటం తప్పులేదు.. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు వారి అప్ డేట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలోనే పంచుకుంటున్నారు. దీనితో ప్రతీ కార్యక్రమం ముందుకు సాగుతోంది …అయితే తాజాగా ఏపీలో కూడా వైసీపీ చూస్తే ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి సోషల్ మీడియాని విపరీతంగా వాడుకున్న పార్టీగా పేరు సంపాదించుకుంది.
పలు వెబ్ సైట్లు, చానల్స్, సోషల్ మీడియా గ్రూపులు, వాట్సాప్ , ఫేస్ బుక్ ఇలా అనేకరకాలుగా వైసీపీకి ప్రచారం చేసుకున్నారు. ఇఫ్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి మరింతగా ప్రచారం చేస్తున్నారు.. తాజాగా పుష్ప శ్రీవాణి ఏపీ డిప్యూటీ సీఎం చేసిన టిక్ టాక్ వీడియో గురించి చర్చ జరుగుతోంది… ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు..శ్రీవాణికి గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు.
అయితే సింగర్ మంగ్లీ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగన్ అన్న అనే పాట పాడారు ఎన్నికల ముందు. ఇది టిక్ టాక్ లో డిప్యూటీ సీఎం లయబద్దంగా అనుకరించి వీడియో చేశారు… ఇది సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.. అయితే దీనిపై టీడీపీ నేతలు చాలా మంది విమర్శలు చేస్తున్నారు, కాని మేధావి వర్గం మాత్రం డిప్యూటీ సీఎం చేసిన పనిలో ఆక్షేపించేది ఏమీ లేదని, అనవసర కామెంట్లు విమర్శలు టీడీపీ మానుకుంటే బెటర్ అని చెబుతున్నారు. అయితే ఆమె వీడియోని చూసిన సహచర మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రం ఆమెని అభినందిస్తున్నారట.