దేశంలో కరోనా విలయం – భారీగా కరోనా కేసులు -ఒక్క రోజే ఎన్నంటే

దేశంలో కరోనా విలయం - భారీగా కరోనా కేసులు -ఒక్క రోజే ఎన్నంటే

0
92

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి…ఎక్కడ చూసినా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది.. కాని ఎక్కడా తగ్గడం లేదు, రోజుకి రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి, ఓ పక్క భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడంతో అనేక స్టేట్స్ ఆంక్షలు, లాక్ డౌన్, రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నాయి.

 

నిన్న కొత్తగా 2,95,041 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు అయింది నిన్న అనే చెప్పాలి, ఏకంగా కరోనా సెకండ్ వేవ్ లో రెండు లక్షలకు పైగానే కేసులు వస్తున్నాయి… కరోనా నుంచి 1,67,457 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,56,16,130 కు చేరింది.

 

ఇక మరణాలు కూడా నిన్న అత్యధికంగా రికార్డు స్ధాయిలో నమోదు అయ్యాయి, ఏకంగా కరోనాతో చికిత్స పొందుతూ

2,023 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,82,553కు పెరిగింది. మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలి అని అధికారులు ప్రభుత్వాలు చెబుతున్నాయి.