దేశంలో కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి.. ఎక్కడ చూసినా వేలాది కేసులు నమోదు అవుతున్నాయి.. ఇక ఈ కరోనా కేసులు పెరగడంతో మరణాలు పెరుగుతున్నాయి…ఇక చాలా చోట్ల పాజిటీవ్ కేసులు పెరగడంతో లాక్ డౌన్ విధిస్తున్నారు….ఇక పరిస్దితి దారుణంగా మారింది. ఇప్పటి వరకూ ఎక్కడా నమోదు కానన్ని కేసులు నమోదు అయ్యాయి భారత్ లో..
నిన్న కొత్తగా 3,14,835 మందికి కరోనా నిర్ధారణ అయింది…కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది ఈ రిపోర్టు . ఇక దాదాపు 3 లక్షల కేసులు దాటుతుంటే రికవరీ సగం మంది అయ్యారు..నిన్న 1,78,841 మంది కోలుకున్నారు.. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,59,30,965 కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 2,104 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఓ పక్క వాక్సిన్ వేస్తున్నా కేసులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి, ఎక్కడా తగ్గడం లేదు, ఇక దేశంలో మొత్తం కోవిడ్ మరణాలు చూస్తే
1,84,657కు పెరిగింది… ఇప్పటి వరకూ దేశంలో 27,27,05,103 కరోనా పరీక్షలు నిర్వహించారు.