మే 2 తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు వస్తాయి… ఆ తర్వాత కచ్చితంగా లాక్ డౌన్ పెడతారు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది… అయితే కేంద్రంలో అధికారులు పలు రాష్ట్రాల్లో అధికారులు మంత్రులు కేంద్ర మంత్రులు ఇదంతా ఉట్టి ప్రచారం అని చెప్పినా కొందరు దీనిని నమ్ముతున్నారు.. ఎన్నికల ఫలితాలు మే 2న రాగానే దీనిపై ప్రకటన వస్తుందని అందరూ భావిస్తున్నారు.
అయితే తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది, అసలు దేశంలో లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు.
కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి సమావేశమయ్యారు. వర్చువల్ పద్ధతిలో జరుగుతోన్న ఈ సమావేశంలో రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ కార్యక్రమం పై చర్చిస్తున్నారు.
దేశ వ్యాప్త లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు. ఇక ఆయా రాష్ట్రాల్లో వస్తున్న కేసులు ఆధారంగా వారే చర్యలు తీసుకోవాలి అని తెలిపారు ప్రధాని మోదీ… ఇక దేశంలో మొత్తం లాక్ డౌన్ పెట్టే ఆలోచన కేంద్రానికి లేదు అనేది తేలింది.