దేవినేని ఉమా అరెస్ట్..

దేవినేని ఉమా అరెస్ట్..

0
112

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరావును అలాగే వర్లరామయ్యతోపాటు మరి కొందరు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజావేదిను నిర్మించారు… ఈ ప్రజా వేదికను కూల్చి నేటితో సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఆప్రాంతానికి టీడీపీ నేతలు భారీ సంఖ్యలో చేరుకున్నారు..

దీంతో కరకట్టవద్ద ఉద్రిక్తత నెలకొంది… పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి టీడీపీ నేతలను అడ్డుకున్నారు… అక్కడకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు…. అయినా కూడా టీడీపీనేతలు అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించారు…

దీంతో పోలీసులకు, టీడీపీ నేతలకు వాగ్వివాదం చోటుచేసుకుంది… అంతటితో ఆగకుండా టీడీపీ నేతల వాహనాలు వెళ్లడంతో పోలీసులు వెంబడించి అడ్డుకున్నారు ఆతర్వాత దేవినేని ఉమాను వర్లరామయ్యను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు..