దీపావళి పండుగకు ఏపీ సర్కార్ భారీ కండీషన్స్…. ఎలాంటి టపాసులు పేల్చాలంటే….

దీపావళి పండుగకు ఏపీ సర్కార్ భారీ కండీషన్స్.... ఎలాంటి టపాసులు పేల్చాలంటే....

0
122

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది…. శనివారం దేశ వ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను జరుపుకోనున్నారు… అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి అదుపులోకి రానందున ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది…

శనివారం పండుగ నాడు రాత్రి పూట కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు పేల్చాలని సూచించింది… రాత్రి 8గంటల నుంచి10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమితి ఇచ్చింది… అవి కూడా పర్యావరణానికి మేలు కలిగించే గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే కాల్చాలని కోరింది…

అలాగే షాపుల వద్ద క్రాకర్స్ కొనుగోలు చేసే టప్పుడు ప్రతీ ఒక్కరు ఆరు అడుగులు దూరం పాటించాలని తెలిపింది… అలాగే షాపుల వద్ద కూడా పేలుడు స్వభావం ఉన్న చోట శానిటైజర్ వాడరాదని తేల్చి చెప్పింది… రాష్ట్రంలో కరోనా కేసులు పేరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సర్కార్ తెలిపింది..