అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా ధరణి పోర్టల్..పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్

0
84

అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా ధరణి పోర్టల్ నిలిచిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ సెల్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిర్వహించిన ధరణి రచ్చబండ కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..నిజాం హయాంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం తెలంగాణ ప్రాంతంలో సాయుధ రైతాంగం పోరాటం సాగింది. ఇప్పుడు నయా నిజాం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కారణంగా భూమి మీద హక్కు కోసం, మా భూమి మాదే అని నిరూపించుకోవడానికి సాయుధ రైతాంగ పోరాటానికి మించి ఉద్యమించాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. తన సొంత భూమిపై పేదోడి హక్కు లేకుండా గుప్పెడు మంది పెట్టుబడిదారులకు వరంలా మారిన ధరణి పోర్టల్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.