టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్దిపై మంత్రి ధర్మాన ప్రసాద్ రావు (Dharmana Prasad Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. “ప్రజా ప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలి. ఒకరి ఆస్తి కోసం కక్కుర్తి పడే మనస్తత్వం ఉండకూడదు. అయాచీతంగా దోబ్బేయాలనుకోకూడదు. నాయకుడు అవనితీకి పాల్పడకూడదు.. ఎవరు చేస్తామన్నా చేయనివ్వకూడదు. ఈ విధానాన్ని కచ్చితంగా తాను పాటిస్తా. శ్రీకాకుళానికి నేను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదు” అన్నారు. ఈ క్రమంలోనే సుబ్బారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
Dharmana Prasad Rao ఏమన్నారంటే..
“కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి.. నేను భూములు దొబ్బేస్తానన్నాడు. నువ్వు ఎవడివి..? శ్రీకాకుళం నీ.. అబ్బసొమ్ముకాదు.. గు.. మీద.. తంతా పొమ్మన్నాను. వచ్చిన వాడు ఏ పార్టీ అనేది చూడను. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ అజమాయిషీ చేద్దాం అనుకుంటారు. అలాంటివి అవమానంగా భావిస్తా. శ్రీకాకుళంలో వనరులున్నాయనే పక్క జిల్లాల నుంచి వచ్చేస్తున్నారు. ఇలా వదిలేస్తే రౌడీలమయం అయిపోతుంది. రౌడీల చేతిలోకి వెళ్లిపోతుంది. మిగతా ప్రాంతాలు ఇలానే పాడైపోతున్నాయి. ప్రశాంతంగా పట్టణాలు ఉండాలి. దశాబ్దాలుగా.. శ్రీకాకుళం ప్రశాంతంగా ఉండాలనే చూస్తున్నా. ఇన్ని చేసినా నేను పనికి రాకపోతే.. మీ (నియోజకవర్గ ప్రజలు) ఇష్టం. విజ్ఞతతో ఆలోచించండి. మీ అభిమానంతోనే గెలుస్తూ వస్తున్నా. జిల్లాలో ఎక్కడైనా నేను గెలుస్తా.. కానీ శ్రీకాకుళంలో వేరేవారు గెలవరు. మిగతా వారు కనీసం అభివృద్ధి కూడా చేయలేరు. గెలిస్తే శక్తివంతంగా ఉంటా.. ఓడితే స్నేహితుడిగా ఉంటా’’ అంటూ ధర్మాన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ధర్మాన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలతో పాటు వైసీపీలోనూ కలవరం రేపుతున్నాయి. ఎన్నికల సమయంలో సాక్షాత్తూ సీఎం జగన్‌కు బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డిపై ఓ మంత్రి ఈ స్థాయి విమర్శలు చేయడం సంచలనంగా మారింది.