ఫ్లాష్: రాహుల్ గాంధీతో కలిసి టీఆర్ఎస్ ఎంపీల ధర్నా

0
81

పార్లమెంట్​లో విపక్షాల నిరసనలు హోరెత్తాయి. ధరల పెరుగుదలను నిరసిస్తూ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. పార్లమెంట్ బయట సైతం నిరసనలు కొనసాగించారు. జీఎస్టీ, నిత్యావసరాల వస్తువుల ధరలు పెంపునకు నిరసనగా కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగాయి. ఈ ధర్నాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొనగా… ఆయన పక్కనే టీఆర్ఎస్ ఎంపీ కేకే నిల్చోని మరి తమ నిరసనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అన్ని పార్టీలను కలుపుకుని పోతామని రెండు పార్టీలు చెబుతున్నాయి.