దరువు .కామ్ ఆన్ లైన్ వెబ్ మీడియాలో సంచలనం..ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలల్లో ప్రజల తరపున ప్రజా గొంతుకై ప్రజావాణిని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడూ చేరవేస్తూ ప్రజలకు మంచి చేసినప్పుడు సపోర్టుగా ఉంటూ..వ్యవస్థలో తప్పులు జరిగితే ఎత్తిచూపుతూ అందరి మన్నలను అందుకున్న ఆన్ లైన్ వెబ్ మీడియా ఛానెల్…తెలంగాణ ఏర్పడిన దగ్గర నుండి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కారు పథకాలను ఒక ప్రక్క ప్రజలకు చేరవేస్తూనే మరోవైపు ప్రతిపక్షాల కుట్రలను ప్రజలకు తెలియజేస్తూ ఇటు ప్రజల్లోనూ అటు టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ గారి కుటుంబానికి దగ్గరయ్యారు దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి… మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తున్న ప్రస్తుత అధికార అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చేసిన ప్రతి ఉద్యమానికి అండగా నిలుస్తూ ప్రజల తరపున టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలను నిర్భయంగా బయట పెడుతూ వైఎస్సార్ కుటుంబానికి చేరువయ్యారు కరణ్ రెడ్డి.
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుస్తుందని..మాములుగా కాకుండా ఏకంగా నూట యాబైకి పైగా స్థానాలను గెలుస్తుందని మొట్టమొదటి ఖచ్చితమైన సర్వే ఫలితాలను వెలువరించింది దరువు.. అయితే గత ఆరేళ్ళుగా ఇటు తెలంగాణ రాష్ట్రానికి అటు ఏపీలో ప్రజల తరపున పోరాడిన మీడియా ఆధినేతగా గుర్తించిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ మెంబర్ గా దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి ని నియమించాలని నిర్ణయించారని సమాచారం…అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతో,నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్య సంబంధాలతో పాటుగా ఆరేళ్లుగా ఇరు రాష్ట్రాల్లో ప్రజల సమస్యల పట్ల పోరాడిన పోరాట పటిమను గుర్తించి టీటీడీ బోర్డు మెంబరుగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం…