విషాదం దారుణం జరిగింది… దీక్షిత్ ను కిడ్నాప్ చేసిన రోజే గంటల వ్యవధిలోనే చంపేశాడు మందసాగర్, అయితే ఈ కేసులో ప్రస్తుతం అతను ఒక్కడే ఇవన్నీ చేసినట్లు ఒప్పుకున్నారు, అతని నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు, ఈ సమయంలో ఆ కిడ్నాపర్ ని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
మందసాగర్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీక్షిత్ రెడ్డిని ఎక్కడైతే హత్య చేశారో అదే ప్రాంతంలో నిందితుడిని ఎన్కౌంటర్ చేసినట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి వివరణ ఇచ్చారు. మంద సాగర్ను ఎన్కౌంటర్ చేయలేదని, ఇవన్నీ ఫేక్ వార్తలు అని తెలిపారు, అంతేకాదు అతనిని ఉదయం 3 గంటలకు అరెస్ట్ చేశాము అన్నారు పోలీసులు
మంద సాగర్తో పాటు మనోజ్ రెడ్డి అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నాం. ఇప్పటి వరకైతే దీక్షిత్ను కిడ్నాప్ చేసి, హత్య చేసింది మంద సాగర్ అని విచారణలో తేలింది. మనోజ్ రెడ్డి పాత్రపై కూడా విచారణ చేస్తున్నామని తెలిపారు. వారి నుంచి వివరాలు సేకరించి పూర్తి వివరాలు తెలుపుతాం అన్నారు పోలీసులు.