స్నేహం అంటే జంతువుల్లో ముందు చెప్పేది చీమల గురించే.. అవన్నీ కలిసి వేలల్లో పుట్టల్లో జీవిస్తాయి, కలిసి కట్టుగా ఉంటాయి, ఏ ఆపద వచ్చినా వెంటనే అవి ఎదుర్కొంటాయి…క్రమశిక్షణ కూడా పాటిస్తాయి. ఇక చీమల గురించి చెప్పుకుంటే
అవి తన శరీరం కంటే 20 రెట్లు ఎక్కువ బరువుని మోస్తాయి, ఈ విషయంలో మన కంటే చాలా బలంగా ఉంటాయి.
అసలు మీకు తెలుసా చీమలు కందిరీగల నుండి పుట్టుకొచ్చాయంటే నమ్ముతారా, దాదాపు పది కోట్ల సంవత్సరాల క్రితం ఇవన్నీ ఒకేలా ఉండేవి తర్వాత పరిణామ క్రమంలో ఇవి కందిరీగల నుంచి విడిపోయి ఇలా ప్రత్యేకంగా తయారు అయ్యాయి.
ఇక చీమలు ఆహారం తీసుకువెళ్లే సమయంలో వాటిని ఎంత బరువు ఉన్నా మోసుకువెళతాయి.
వీటికి ఊపిరితిత్తులు, గుండె ఉండవు. ఇక మనకు రక్తం అంటే ఎరుపు రంగులో ఉంటుంది . కాని వీటికి రక్తానికి రంగు ఉండదు.
చిన్న చిన్న కళ్ళు చాలా ఉంటాయి, పైకి మనక రెండు కళ్లు మాత్రమే కనిపిస్తాయి… రసాయనాల వాసనను పసిగట్టి చీమలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయనే విషయం మీకు తెలుసా… వీటి కోరలు చాలా బలంగా ఉంటాయి అందుకే అంత గట్టిగా కరుస్తాయి. ప్రపంచంలో మనుషుల కంటే చీమలు 100 రెట్లు ఎక్కువ ఉన్నాయి..