నూతులు బావులు చెరువులు నదులు సరస్సులు సముద్రాలు, దేవాలయాలు, అడవులు ఎక్కడ చూసినా చాలా ఎక్కువగా కనిపిస్తాయి తాబేళ్లు, మరీ ముఖ్యంగా సాధారణ తాబేళ్లు కనిపిస్తాయి.. కాని నక్షత్ర తాబేళ్ల గురించి చాలా మందికి తెలియదు, వీటిని అరుదుగా చూస్తూ ఉంటారు..ముఖ్యంగా అదృష్టం అనే పేరు చెబితే చాలు ఈ అరుదైన జీవులు నక్షత్ర తాబేళ్ల పేరు చెబుతారు.
తాబేళ్లను దళారులు అక్రమంగా రవాణా చేసి లక్షలాది రూపాయలను వెనుకేసుకుంటున్నారు. దేవాలయాలు, అడవుల్లోనూ ఉండాల్సిన నక్షత్ర తాబేళ్లు ఇప్పుడు మన దేశం నుంచి విదేశాలకు వెళుతున్నాయి.నక్షత్ర తాబేళ్లు ఎక్కువగా ఆకురాల్చే అడవుల్లో పెరుగుతాయి.
ఈ తాబేళ్లను ఇళ్లలో పెంచుకుంటే సిరిసంపదలు కలుగుతాయనే సెంటిమెంట్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ. అందుకే మన నుంచి ఇవి ఇతర స్టేట్స్ కు తరలిపోతున్నాయి..తాబేలును రూ.50వేల వరకు విక్రయిస్తున్నారట.. ఈ నక్షత్ర తాబేళ్లకు చైనా, థాయిలాండ్ లాంటి దేశాల్లో భారీ డిమాండ్ ఉంది.
ఫ్రెండ్స్ గానీ, చుట్టాలు గానీ ఇంటికి వచ్చినా లేదా శుభకార్యాలకు వెళ్లినా నక్షత్ర తాబేలును కానుకగా ఇస్తారు. అక్కడ కూడా లక్షల రూపాయల ధర పలుకుతున్నాయి. అయితే వీటిని అక్రమ రవాణా చేస్తే 1972 వన్యప్రాణి సంరక్షణ విభాగం చట్టం ప్రకారం ఏడు సంవత్సరాల జైలుశిక్ష అని తెలియచేస్తున్నారు అధికారులు. అయితే ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకోకండి నమ్మకండి, పాపం వాటిని స్వేచ్చగా జీవించనివ్వండి అంటున్నారు జంతు ప్రేమికులు.