కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ నేడు భూమి పూజ చేయనున్నారు, దేశంలో దీని గురించి చర్చ జరుగుతోంది.. తాజాగా నిర్మించబోయే కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి సంబంధించిన నమూనాలను డిసెంబరు 5న కేంద్రం విడుదల చేసింది. మొత్తం ఈ నిర్మాణ శైలి అంతా మన భారతీయత ఉట్టి పడేలా ఉండనుంది.
మొత్తం 64,500 చదరపు మీటర్ల పరిధిలో ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించనున్నారు. భూకంపాలు భారీ వర్షాలు దేనిని అయినా తట్టుకునేలా దీనిని నిర్మిస్తున్నారు…ఈ కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి రూ.971 కోట్లు అవుతుందని అంచనా వేశారు. దీని నిర్మాణ బాధ్యతలు టాటా కంపెనీ చేపడుతోంది, ఇక దీని నిర్మాణం వచ్చే ఏడాది అంటే 2021
ఆగస్టు 15 నాటికి పూర్తి చేయనున్నారు.
ఈ కొత్త భవనంలో లోక్ సభ సభ్యుల కోసం 888 సీట్లు, రాజ్య సభ సభ్యుల కోసం 326 సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల సమావేశం జరిగితే.. లోక్సభలో ఒకేసారి 1224 మంది సభ్యులు కూర్చునేలా సీట్లు ఏర్పాట్లు చేస్తారు..
మొత్తం 18.37 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంతో పార్లమెంట్ విస్టా భవనం నిర్మించనున్నారు.