దిగ్గజ కంపెనీలు డేటా దాచడం కోసం హైదరాబాద్ ని ఎందుకు ఎంచుకుంటాయి? కారణాలు ఇవే

దిగ్గజ కంపెనీలు డేటా దాచడం కోసం హైదరాబాద్ ని ఎందుకు ఎంచుకుంటాయి? కారణాలు ఇవే

0
105
Amazon Layoffs

హైదరాబాద్ మహానగరంలో లక్షలాది మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఉన్నారు, వేలాది కంపెనీలు ఉన్నాయి, అయితే భారీ పెట్టుబడులు కూడా హైదరాబాద్ కు వస్తున్న విషయం తెలిసిందే, ఐటి కారిడార్ గా ఐటీ హాబ్ గా దేశంలో భాగ్యనగరానికి ఎంతో పేరు ఉంది, అయితే తాజాగా అమెజాన్ హైదరాబాద్ మహానగరంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.సుమారు రూ.20వేల కోట్లకుపైనే పెట్టుబడులు పెడుతున్నారు.

డేటా కేంద్రాల క్లస్టర్ ను ఏర్పాటు చేయటానికి అమెజాన్ హైదరాబాద్ ను ఎంపిక చేసుకుంది, వందల ఉద్యోగాలు వస్తాయి, దీని వల్ల కంపెనీకి చాలా లాభం, ఇప్పటివరకు ఉన్న కేంద్రాల డేటా సామర్థ్యం దాదాపు 32 మెగావాట్ల వరకు ఉందని చెబుతారు ఐటీ నిపుణులు, వచ్చే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.

అయితే అందరూ ఇక్కడే ఎందుకు సెట్ చేస్తారు అంటే చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఇక్కడ వాతావరణం బాగుంటుంది, యుద్దభయాలు ఉండవు, అలాగే తుఫాను సమస్యలులేవు, డేటా కి సర్వీసుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, అలాగే ప్రకృతి విపత్తులు తక్కువ, దేశంలో మధ్యలో ఉన్న భాగం, టెక్నికల్ సమస్యలు అంతగా ఎప్పుడూ రాని హిస్టరీ, ఇవన్నీ హైదరాబాద్ ని ఎంపిక చేయడానికి ప్రధాన కారణం.

ఏ సాఫ్ట్ వేర్ కంపెనీ అయినా తమ డేటాను ఒక చోట మాత్రమే కాకుండా.. రెండుమూడు చోట్ల దాస్తుంది. సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తకపోయినా విపత్తులు ఏదైనా ప్రమాదాలు వస్తే డేటా పోతే చాలా కష్టం అందుకే ఇలా స్టోర్ చేస్తారు.