పవన్ కోసం విమానం ఏర్పాటు చేసిన నిర్మాత దిల్ రాజు

పవన్ కోసం విమానం ఏర్పాటు చేసిన నిర్మాత దిల్ రాజు

0
89

పవన్ కల్యాణ్ సినిమా అంటే అభిమానుల్లో ఎలాంటి రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయో తెలిసిందే… పైగా ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చి చాలా కాలం అయింది.. తాజాగా రీ ఎంట్రీతో సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా పింక్ ..అయితే ఈ సినిమాని దిల్ రాజ్ బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు అనే విషయం తెలిసిందే..

ఇక ఈ చిత్రం హిందీ వెర్షన్ లో అమితాబ్ లీడ్ రోల్ పోషించారు. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తారాగణంలో నివేదా థామస్, అంజలి.. తదితరులున్నారు. ఇంకా లీడ్ నటులని తీసుకున్నారు, వేణుశ్రీరామ్.

అయితే ఇప్పుడు రాజకీయాల్లో కూడా పవన్ బిజీగా ఉన్నారు… అందుకే పవన్ పింక్ సినిమా షూటింగ్ కి చాలా తక్కువ రోజులు కాల్షీట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది… అందుకే పవన్ కల్యాణ్ ఈ షూటింగుకు అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చి వెళుతుండడానికి నిర్మాత దిల్ రాజు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి..

ఇందుకోసం ఆయన దాదాపుగా కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారట… పవన్ రాజకీయంగా బిజీగా ఉండి సినిమాకోసం కేవలం 30 రోజుల కాల్షీట్లు ఇచ్చారని.. అందుకే సమయం లేకపోవడంతో ఇలా విమానం ఏర్పాటు చేశారని వార్తలు వస్తున్నాయి.