మనందరం ఎంతగానో ఎదురుచూస్తున్న బతుకమ్మ పండుగ రానే వచ్చింది. ఇంకొన్ని రోజుల్లో గ్రామాల్లో బతుకమ్మ సంబురాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రజలు ఇతరతరా పనులను పూర్తి చేసుకుంటున్నారు. 2017లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాదీ కూడా బతుకమ్మ చీరల పంపిణీ నేటి నుండి షురూ కానుంది.
ఇందుకోసం సర్కార్ ఇప్పటికే ఏకంగా కోటి చీరలను సిద్ధం చేసి జిల్లాలకు కూడా తరలించారు. ఇందుకోసం మొత్తం 339.73 కోట్లు ఖర్చు చేసినట్టు ఈ మేరకు సర్కార్ తెలియజేసింది. 10 రకాల రంగుల్లో 24 విభిన్న డిజైన్లతో, 240 రకాల త్రేడ్ బోర్డర్‌లతో చీరలను తయారు చేయించినట్టు సర్కార్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఆహార భద్రత కార్డ్ కలిగిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు బతుకమ్మ చీరను ప్రభుత్వం అందిస్తుంది.