నాకు వెన్నుపోటు పొడిచింది బీజేపీ కాదు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే: డీకే శివకుమార్

నాకు వెన్నుపోటు పొడిచింది బీజేపీ కాదు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే: డీకే శివకుమార్

0
96

కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలపై కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు వెన్నుపోటు పొడిచింది బీజేపీ నేతలు కాదని… ముంబైలో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలేనని మండిపడ్డారు. ఎంబీటీ నాగరాజ్ కు తన వల్లే టికెట్ వచ్చిందని… ఆయనతో తాను కూడా మాట్లాడానని చెప్పారు. మేం కావాలనుకుంటే తమ బంధీలో ఉంచుకునేవారిమని…. కానీ, వారిపై నమ్మకంతో అలా చేయలేదని చెప్పారు. వారిని బెంగళూరుకు తీసుకురావాలని… వారు కావాలనుకుంటే విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసుకోవచ్చని అన్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలు సభకు వచ్చి, ఓటింగ్ లో పాల్గొనాలని సూచించారు.