తమిళనాడులో డీఎంకే పార్టీ స్థానిక పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటింది. తొమ్మిది జిల్లాల్లో జరిగిన గ్రామీణ ఎన్నికల్లో డీఎంకేతో పాటు కూటమి పార్టీలు విజయకేతనం ఎగురవేశాయి. అక్టోబర్ 6, 9 తేదీల్లో ఆ ఎన్నికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
కానీ డీఎంకే కూటమి అన్ని పంచాయత్‌లను నెగ్గినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకేపై ఆ పార్టీ ఆధిక్యంలో ఉన్నది. ఇతర జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో 27 వార్డుల్లో డీఎంకే హవా కొనసాగుతోంది. 140 జిల్లా పంచాయతీ సీట్లలో.. డీఎంకే పార్టీ 88 స్థానాల్లో విక్టరీ నమోదు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అన్నాడీఎంకే కేవలం 4 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. పంచాయతీ యూనియన్ వార్డుల్లోనూ డీఎంకే సత్తా చాటింది. 9 జిల్లాల్లోని 1381 వార్డుల్లో 300 సీట్లలో డీఎంకే దూసుకువెళ్తోంది.