Flash: రోడ్డు ప్రమాదంలో డీఎంకే ఎంపీ కొడుకు మృతి

0
82

డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఎన్ఆర్ ఇళంగోవన్ కుమారుడు రాకేశ్ ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాకేశ్ పుదుచ్చేరి నుంచి మరో వ్యక్తితో కలిసి చెన్నై వెళ్తుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రాకేశ్ అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.