ఇటీవల ఓ వార్త వినిపిస్తోంది.. బంగారు నగలు కొంటే కచ్చితంగా పాన్ కార్డు ఇవ్వాలి అని వార్త వినిపిస్తోంది.. అయితే సోషల్ మీడియాలో ఈ ప్రచారం బాగా జరుగుతోంది..అయితే చాలా మంది ప్రజలు ఇది నిజమా అసత్యమా తెలియక సతమతమవుతున్నారు, తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది..
దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ-DoR క్లారిటీ ఇచ్చింది. మీరు రెండు లక్షల రూపాయలకంటే ఎక్కువ కలిగిన బంగారం వజ్రాలు వెండి ఇలా వస్తువులు కొంటే కచ్చితంగా పాన్ కార్డు ఇవ్వాల్సిందే, ఒకవేళ రెండు లక్షల రూపాయల కంటే తక్కువ అయితే మీరు పాన్ కార్డు ఇవ్వవలసిన అవసరం ఉండదు.
రూ.2,00,000 లోపు బంగారం, వెండి, నగలు, విలువైన రత్నాలు, రాళ్లు కొంటే మీరు కేవైసీ డాక్యుమెంట్ పాన్ కార్డ్
ఇవ్వాలి, దీనిపై డీవో ఆర్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ రూల్ ఏమిటి అంటే ..ఆదాయపు పన్ను చట్టం-1961 లోని సెక్షన్ 269ST ప్రకారం భారతదేశంలో ఎవరూ రూ.2,00,000 కన్నా ఎక్కువ నగదు ఒకేసారి లావాదేవీలు జరపడం నిషేధం…ఇలా చేసే నగదు ట్రాన్సాక్షన్లు కచ్చితంగా పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది.