ఏటీఎం కి మనలో 100 కి 80 మంది వరకూ వెళుతున్నాం.. నగదు తీసుకోవాలి అంటే గతంలో బ్యాంకుకు వెళ్లేవాళ్లం.. కాని ఇప్పుడు అంతా ఏటీఎమ్ లోనే నగదు తీసుకుంటున్నాం.. అయితే ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. లేకపోతే ఇబ్బందులు తప్పవు అంటున్నారు నిపుణులు.. ఇటీవల జరుగుతున్న వరుస మోసాలతో అలర్ట్ చేస్తున్నారు వినియోగదారులని.. ముఖ్యంగా బ్యాంకులు కూడా అనేక యాడ్స్ అలర్ట్ మెసేజ్ లు పంపుతున్నాయి.
1. మీరు ఏటీఎంలో నగదు తీసుకున్న సమయంలో పక్కన ఎవరిని నిలబడనివ్వకండి
2. మీపాస్ వర్డ్ కనిపించేలా అసలు టైప్ చేయవద్దు
3.ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్న వెంటనే క్యాన్సల్ బటన్ నొక్కాలి
4. ఇక తర్వాత ఏటీఎం నుంచి వచ్చే స్లిప్ ని మాత్రం అక్కడ డస్ట్ బిన్ లో పాడేయకండి
5. దాని నుంచి మోసాలు చేసే అవకాశం ఉంటుంది ఆ స్లిప్ మీరు ఇంటికి తీసుకువెళ్లిపోండి
6..సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతంలో ఏటీఎం నుంచి నగదు తీసుకోండి
7. జనం రద్దీ ఉన్న ఏటీఎంల నుంచి నగదు తీసుకోండి ఇది ఉత్తమం
8.కార్డు స్కిమ్మింగ్, కార్డు షిమ్మింగ్, కార్డు ట్రాపింగ్ ఇలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండండి.