మనం పూజలు చేసే సమయంలో పండుగల సమయంలో పూలు వాడుతూ ఉంటాం, దేవుడికి అలంకరిస్తాం, ఇటీవల పెరటిలోనే కాదు ఇంటిలో కూడా అందంగా మొక్కలు పెంచుకుంటున్నాం.. అయితే ఇక్కడ వాస్తుశాస్త్రం ప్రకారం కూడా కొన్ని పూలు వాడద్దు అంటున్నారు పెద్దలు, అయితే ఇలాంటివి ఇంట్లో ఉంటేనెగిటీవ్ ఎనర్జీ అంటున్నారు.
ముఖ్యంగా తూర్పు దక్షిణ సింహద్వారాల ఇళ్లు ఉన్న వారు ఇంటి గుమ్మానికి చాలా మంది ప్లాస్టిక్ పూల దండలు కడుతున్నారు ఇది మంచిది కాదు. ఇలా కట్టద్దు అంటున్నారు. ఇక దేవుని పటాలకు కూడా ఇలాంటి ప్లాస్టిక్ పూలు పెడుతున్నారు ఇలా కూడా పెట్టకూడదు.
ఇలాంటి ప్లాస్టిక్ పూలను ఇళ్లు, షాపులు, ఆఫీసుల్లో ఎక్కడా వాడకూడదని అంటున్నారు. ఎట్టి పరిస్దితుల్లో అలాంటి పూలు పూజలు చేయకూడదు, నీరు వేసుకుని గాజు బౌల్ లో అందం కోసం వాడాలి కాని ఇలాంటి పూలని దేవుడికి పూజలకి వాడవద్దు. ఇక ఓ రోజు అయినా వాడిపోయి పోతున్న పూలని కూడా తొలగించండి. వాటిని మట్టిలో వేయాలి లేదా మొక్కలపై పడేయవచ్చు, ఇలాంటివి దేవుని గదిలో ఉంచకూడదు.